జెడ్పి జిపిఎఫ్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
NEWS Sep 03,2024 02:19 pm
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వాణాధికారి (CEO) వినోద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఈఓ వినోద్, డిప్యూటీ సిఇఓ మచ్చ గీతతో సమావేశమై ఉపాధ్యాయుల జెడ్పి జిపిఎఫ్ సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దొంతుల శ్రీహరి, పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిలర్ ఏ.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.