హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం
NEWS Sep 03,2024 02:20 pm
తెలంగాణ సహజ వనల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు దేవయ్య మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారధ్యంలో GHMC పరిధిలో చెరువులు కుంటలు, నాళాలు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి విల్లాలు కన్వెన్షన్లు బిల్లింగ్ నిర్మాణాలను కూల్చి వేస్తున్న తరుణంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైడ్రా చేపట్టిన చర్యలను స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు.