కోనసీమ: భారీ వర్షాల వల్ల కోనసీమ జిల్లాలో 870 ఎకరాల్లో వరి పంట ముంపు బారిన పడిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసుబాబు తెలిపారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఆయన మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పర్యటించారు. ముంపు బారిన పడిన పంట పొలాలను సంరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈనెల 19 నుంచి 20 వరకు మరో విడత ఈ-క్రాప్ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ADA రామ్మోహనరావు పాల్గొన్నారు.