దివ్యాంగులకు సపోర్టుగా ఉంటాం
NEWS Sep 03,2024 02:38 pm
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఓ సమావేశానికి రాగా పలువురు దివ్యాంగులు కలిశారు. జిల్లా పరిధిలో వివిధ శాఖలలో ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో దివ్యాంగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. జిల్లాలో ఉన్న 25 ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే వివిధ ఉద్యోగాలలో దివ్యాంగులకు లభించే 3% రిజర్వేషన్‌ను అమలు చేసేలా చూడాలని కోరారు. తద్వారా వారికి ఉపాధి కల్పించిన వారమవుతామని తెలిపారు.