పిల్లలకు పోషక ఆహారం అందించాలి
NEWS Sep 03,2024 01:25 pm
పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిరిసిల్లజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ నెల 1 నుంచి 30 వరకు చేపట్టనున్న పోషణ అభియాన్ జిల్లాస్థాయి కన్వర్జెన్స్ సమావేశం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ.ప్రతి పిల్ల వాడి ఎత్తు, బరువులు తీసి తద్వారా పోషణ లోపం, తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ఆన్లైన్ లో నమోదుచేయాలన్నారు. పోషణలోపం, తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందజేయాలని సూచించారు.