తండ్రీకూతుళ్లకు అంత్యక్రియలు
NEWS Sep 03,2024 12:32 pm
మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమగూడెం వద్ద ఆకేరు వాగు దాటుతుండగా కారుతో సహా కొట్టుకుపోయిన సైంటిస్ట్ అశ్విని (25), ఆమె తండ్రి మోతీలాల్ (60) అంత్యక్రియలు సింగరేణి కారేపల్లి గంగారం తండాలో ముగిశాయి. ఖమ్మం జిల్లాకు చెందిన లంబాడ గిరిజన కుటుంబానికి చెందిన వారు. అశ్విని మృతదేహం ఆదివారం లభ్యం కాగా, ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహం సోమవారం లభ్యమైంది. ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్విని తన తండ్రి మోతీలాల్ తో కలిసి ఛత్తీస్ ఘఢ్ రాజధాని రాయపూర్ లో వ్యవసాయ సదస్సుకు హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి కారులో బయలుదేరినప్పుడు పురుషోత్తమయ గూడెం వద్ద వరదలో కొట్టుకుపోయిన విషాదం ఇది.