గుంతలను సత్వరమే పూడ్చండి
NEWS Sep 03,2024 12:36 pm
నగరంలోని రోడ్లపై రాళ్లుండొద్దని, గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులను మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ పథకంలో భాగంగా చేపట్టి పెండింగ్‌పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టలు, టీయూఎఫ్ఐడీసీ ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో సీఆర్‌ఎంపీ, ఎస్‌ఆర్‌డీపిఎస్‌ఎన్‌డీపీ పనులపై సమీక్ష నిర్వహించారు.