హరీష్, సబితా వాహనాలపై రాళ్ల దాడి
NEWS Sep 03,2024 12:06 pm
ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారి కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తుండగా.. ఈ దాడిలో నామా నాగేశ్వర రావు కారు పూర్తిగా ద్వంసమైంది.