కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్న ఉద్దేశంతో మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 13 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వారిని మెజిస్ట్రేట్ నరసింహారావు ఎదుట హాజరు పరచగా.. ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారన్నారు. మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారని తెలిపారు.