రోడ్డు భద్రత నియమాలను ప్రతి డ్రైవర్ తప్పక పాటించాలని మండపేట రూరల్ సీఐ దొరరాజు అన్నారు. ఏడిదలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు చట్టాలపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించ రాదన్నారు. ప్రతి డ్రైవర్ తమ వాహనానికి సంబంధించిన రికార్డును తప్పనిసరిగా పాటించాలన్నారు.