TUWJ (IJU)లో చేరిన ప్రెస్ క్లబ్ సభ్యులు
NEWS Sep 03,2024 12:34 pm
తంగళ్ళపల్లి మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు, పిల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో 23 మంది సభ్యులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియూడబ్ల్యూజే ఐజేయు లో చేరారు. స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టియూడబ్ల్యూజే సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ వారికి సభ్యత్వాలను నమోదు చేయించి, రశీదులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముత్యo, రాష్ట్ర లీగల్ అడ్వైజరి కమిటీ సభ్యులు రేగుల దేవేందర్, పిల్లి శ్రీనివాస్, దేవెందర్, ఆంజనేయులు, వెంగళ శ్రీనివాస్ పాల్గొన్నారు.