హరీశ్, పువ్వాడ, సబిత వాహనాలపై రాళ్ల దాడి
NEWS Sep 03,2024 12:00 pm
ఖమ్మం: వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబిత ఇంద్రారెడ్డి, మాజీ mp నామా నాగేశ్వర్ రావు వచ్చారు. ఈ సమయంలో అనూహ్యంగా కొందరు వారి వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో మాజీ మంత్రుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమై రాళ్లు రువ్విన వారిపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు.