ఆపదలో ఆదర్శంగా నిలిచిన MLC
NEWS Sep 03,2024 11:26 am
TG: వరద బాధితులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఒక నెల జీతం రూ. 2 లక్షల 75 వేలు సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ స్థాయిలో వచ్చిన వరదల కారణంగా 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా తమ నెల శాలరీ విరాళంగా ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్ చేశారు.