మల్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారము కంటి పరీక్షలు నిర్వహించే ఆప్తాల్మిక్ గత మూడు వారాలుగా రాకపోవడంతో కంటి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మంగళవారం దాదాపు పదుల సంఖ్యలో కంటి సమస్యల పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ఈరోజు కంటి పరీక్షలకు వచ్చినవారు ఆప్తాల్మిక్ లేకపోవడంతో చాలాసేపు వెయిట్ చేసి తిరిగి ఆవేదనతో వెళ్ళిపోయారు. కాగా ఈ విషయమై ఆసుపత్రి సిబ్బందిని వివరణ కోరగా డిప్యూటేషన్ పై వెళ్లినట్లు తెలిపారు.