క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవ్వాలి
NEWS Sep 03,2024 11:09 am
వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, సరైన కారణం లేకుండా వారికి సెలవు మంజూరు చేయరాదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాస్టల్ వార్డెన్లను, సంక్షేమ అధికారులను ఆదేశించారు.
సుభాష్ నగర్ లోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. తరగతులకు క్రమం తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కారణం లేకుండా కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లో ఉండకూడదని సూచించారు.