నేడు లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు
NEWS Sep 03,2024 11:08 am
శ్రీసత్యసాయిజిల్లా: లేపాక్షి శ్రీదుర్గా వీరభద్రస్వామి దేవాలయంలో వీరభద్రస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయ కమిటీ ఛైర్మన్ కరణం రమానందన్ ఆధ్వర్యంలో స్వామికి, అమ్మవారికి ప్రత్యేక పూలతో అలంకరణ, అభిషేకం చేశారు. అనంతరం భక్తులు దర్శనం కల్పించారు. అనంతరం భక్తులకు ఆలయ ఛైర్మన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.