జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ
NEWS Sep 03,2024 11:06 am
జిల్లాల్లో కూడా చెరువులు, కుంటలు కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్లో ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కబ్జాలకు పాల్పడింది ఎంతటి వాళ్లైనా వదిలి పెట్టవద్దని సూచించారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో కాలువలను కూడా వదల్లేదని.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించానన్నారు.