పేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ
NEWS Sep 03,2024 11:05 am
దండేపల్లి గ్రామానికి చెందిన సిద్ధి సత్తన్న మల్లేశ్వరిల కుమారుడు సిద్ధి తరుణ్ ఇటీవల ఆక్సిడెంట్ జరగడంతో అతని చెయ్యి విరిగింది. అతనిది నిరుపేద కుటుంబం కావడంతో అమ్మ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి గడిగొప్పుల వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను వినోద్ అధ్యక్షులు భాను ప్రసాద్ చేతుల మీదుగా సాయం చేశారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న అమ్మ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి వినోద్ కుమార్ ను పలువురు అభినందించారు.