సిరిసిల్ల పట్టణం18వ వార్డులో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యములో తెలంగాణ సాంస్కృతిక సారథి ఎడమల శ్రీధర్ రెడ్డి కళా బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. మానవజాతి మనుగడకు మూలం చెట్లు పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారు. చెడు గాలిని పీల్చుకొని మనకు ప్రాణ వాయువును అందించే పచ్చని చెట్లు ప్రతీ ఒక్కరూ ఇంటి ముందర పెంచుకోవాలని ప్లాస్టిక్ కవర్లను వాడకం ఆరోగ్యానికి హానికరమని బట్ట సంచులు వాడుకొని ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి వెయ్యాలని సూచించారు.