వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
NEWS Sep 03,2024 09:53 am
వేములవాడ: గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు, ఆయా శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం, క్రైస్తవ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.