HMను సస్పెండ్ చేయొద్దని విద్యార్ధినుల ధర్నా
NEWS Sep 03,2024 10:06 am
డుంబ్రిగూడ: డుంబ్రిగూడ మండలం జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్ధినుల అస్వస్థత ఘటనకు బాధ్యులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని వార్డెన్ సుజాతను సోమవారం ఐటీడీఏ పీఓ అభిషేక్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుజాతను సస్పెన్షన్ చేయొద్దని పాఠశాల విద్యార్ధినులు మంగళవారం స్కూల్ ఆవరణలో ధర్నా చేశారు. ఈ మేరకు వారు హెచ్ఎం తప్పు చేయలేదని, హెచ్ఎం తమకు కావాలని నినాదాలు చేశారు.