పెద్ద మనసు చాటిన యంగ్ హీరోలు
NEWS Sep 03,2024 09:37 am
తెలుగు రాష్ట్రాల వరద సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తూ తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ (డీజే టిల్లు), విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ వరద సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. సిద్దు రూ. 15లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు రూ. 30 లక్షలు విరాళంగా అందించారు. అలాగే మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇరు రాష్ట్రాల వరద సహాయనిధికి చెరో 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షలు విరాళం ప్రకటించారు.