ఉద్యోగ సంఘాలు 100 కోట్ల విరాళం
NEWS Sep 03,2024 09:32 am
TG: భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. వీరి ఒకరోజు వేతనం దాదాపు రూ.100 కోట్లు అవుతుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు.