నరమాంసానికి మరిగిన తోడేళ్లు
NEWS Sep 03,2024 07:58 am
ఉత్తర ప్రదేశ్‌ని నరమాంస భక్షక తోడేళ్లు భయపెడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలో మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్‌గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించారు. దీంతో తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి అంటూ అధికారులను సీఎం యోగి అదేశించారు. ‘‘ఆపరేషన్ భేదియా’’ కింద 4 తోడేళ్లను పట్టుకున్నారు. పిల్లలే లక్ష్యం కావడంతో అటవీ అధికారులు పిల్లల సైజులో ఉండే బొమ్మలను తీసుకువచ్చి, వాటికి పిల్లల మూత్రంలో తడిపి తోడేళ్లను తప్పుదారి పట్టించి, బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.