సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు నిండి పొర్లుతుంది. నల్లవాగు ప్రాజెక్టు జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు కావడం విశేషం. రాత్రి రాష్ట్రంలోనే అత్యధికంగా 96.3 మిల్లీమీటర్ల వర్షం సిర్గాపూర్ లో కురిసింది. భారీ వర్షం కురవడంతో 1493 అడుగుల సామర్థ్యం కలిగిన నల్లవాగు ప్రాజెక్టు నిండి ప్రవహిస్తుంది. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి వృధా కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు.