విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
NEWS Sep 03,2024 06:50 am
హిందూపురం: డి. ఫార్మసీ విభాగం ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాలలో హిందూపురం విద్యార్థులు సత్తా చాటారు. పట్టణానికి చెందిన జయలక్ష్మి 1000కి 985, ఎస్ షాహిస్తా ఫిర్దోస్ 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హరీశ్ బాబు తెలిపారు. అలాగే తమ కళాశాలకు చెందిన 45 మంది విద్యార్థులలో 17 మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించారన్నారు.