నేడు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
NEWS Sep 03,2024 06:31 am
అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఈనెల 3న మంగళవారం సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.