5, 6 తేదీల్లో మరో అల్పపీడనం
NEWS Sep 03,2024 06:32 am
సెప్టెంబర్ 5,6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఇది తుపానుగా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది