వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు
NEWS Sep 03,2024 06:32 am
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలు,పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అవసరమైన వారందరికీ టెస్టులు చేసి, మందులు అందజేయాలన్నారు. వరదల తర్వాత జ్వరాలు,డయేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని, బాధితుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని సూచించారు.