రేవంత్‌పై హరీష్ విమర్శలు
NEWS Sep 03,2024 06:49 am
సీఎం రేవంత్ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ‘సీఎం స్థాయిని దిగజార్చి, విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం. తాను చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నారు’ అని Xలో ట్వీట్ చేశారు.