రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
25 మందికి గాయాలు
NEWS Sep 03,2024 06:57 am
శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తనకల్లు మండలం గంగసానిపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.