ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయిని సస్పెన్షన్
NEWS Sep 03,2024 07:00 am
డుంబ్రిగూడ మండలం, జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్ధినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటన విధితమే. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయిని, వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న సుజాతాను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ చేశారని ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు తెలిపారు.