రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివసిస్తున్న సనుగుల లక్ష్మి రాములు దంపతుల ఇల్లు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది. పేద కుటుంబానికి చెందిన బాధితులకు మండల తహసిల్దార్ రామచంద్రం సిబ్బంది సంతోష్, అశోక్ లతో నిత్యవసర సరుకులు అందించారు. మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు, కనకరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.