నకిలీ అధికారుల అక్రమ వసూళ్లు
NEWS Sep 03,2024 08:11 am
ముంచింగిపుట్టు: అధికారులమంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన నకిలీలు అడ్డంగా దొరికిపోయారు. విశాఖ ఆరిలోవకి చెందిన బొత్స యువరాజు, మండవల్లి రాజారత్నంలు ముంచింగిపుటలోని ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి తాము అటవీశాఖ అధికారులమంటూ వైద్యశిబిరం నిర్వహణకు డబ్బులు కావాలని 6 వేలు వసూలు చేశారు. ZP చైర్ పర్సన్ భర్త మూర్తి నుండి 3 వేలు వసూలు చేయగా.. మూర్తి DFOకి ఫోన్‌లో సంప్రదించగా వైద్య శిబిరం నిర్వహించడం లేదని DFO బదులిచ్చారు. సదరు నకిలీలను పట్టుకొని మూర్తి పోలీసులకు అప్పగించారు.