బీ-అలెర్ట్: ఇప్పుడే తెచ్చుకొండి
NEWS Sep 02,2024 06:45 pm
స్టేట్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగింది. దీంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. మార్కెట్లకు రావాల్సిన కూరగాయల వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కూరగాయల నిల్వలు తగ్గిపోవడంతో అతి త్వరలో ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు మరింతా పెరగకముందే తెచ్చి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.