అనంతపురంకు భారత క్రికెటర్లు
NEWS Sep 02,2024 06:04 pm
అనంతపురంలో ఈ నెల 5 నుంచి జరగనున్న దులీప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు అనంతపురం చేరుకున్నారు. బెంగళూరు నుంచి నగరానికి చేరుకున్న వారికి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతపురం వచ్చిన వారిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, పడిక్కల్, తుషార్ దేశ్ పాండే, తదితర ఆటగాళ్లు ఉన్నారు. అలెగ్జాండర్, మాసినేని స్టార్ హోటళ్లలో బస చేయనున్నారు.