యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 02,2024 06:09 pm
భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం గ్రామ చెరువును సీపీ సందర్శించి మత్స్యకారుడి గల్లంతు ఘటనపై ఆరా తీశారు. హుస్సేన్ మియా వాగు, గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి,అత్యవసర వేళల్లో భద్రత చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.