ఇది కుంభకర్ణ ప్రభుత్వం: కేటీఆర్
NEWS Sep 02,2024 06:05 pm
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, కనుక ప్రభుత్వం అలర్ట్‌గా ఉండాలని తెలియజేసింది. కానీ రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు.. ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ అన్నారు.