కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
NEWS Sep 02,2024 06:07 pm
BRSపై తీవ్రస్థాయిలో మండిపడ్దారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరదలపై BRS బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే, ఆమెరికాలో ఉండి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. కవితకు బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించారా అని ప్రశ్నించారు. తాను 3 రోజులుగా నిద్రలేకుండా సమీక్ష చేస్తున్నానని మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని చెప్పారు.