ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు
NEWS Sep 02,2024 06:08 pm
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గ్రామ జనసేన అధ్యక్షులు నల్లా చిన్నబాబు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు రాజేష్,జిల్లా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లా నాయిడు, ఉమ్మడి జిల్లా చిరు ఫ్యాన్స్ అధ్యక్షులు నల్లా చిట్టి,రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ నాయకులు ఆర్డీఎస్ ప్రసాద్ పాల్గొని కేకు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, చిరు, పవన్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.