గోదావరిని పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్
NEWS Sep 02,2024 04:35 pm
మల్లాపూర్: గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. వాల్గొండ గోదావరిని పరిశీలించారు. ఎస్సారెస్పీ ద్వారా గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారని, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, తాసిల్దార్ వీర్ సింగ్, ఎస్సై కిరణ్, ఎఫ్ఎసి ఎంపీడీవో జగదీష్ పాల్గొన్నారు.