కడెం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి
NEWS Sep 02,2024 04:36 pm
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులోని వరద నీరు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో గురించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకుంటామన్నారు.