YSRకి కాంగ్రెస్ నాయకుల నివాళులు
NEWS Sep 02,2024 04:37 pm
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా దగ్గర సోనియా గుడి ముందు మండల కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దొంగ ఆనంద రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, ముత్యంపేట మాజీ సర్పంచ్ బత్తిని శ్రీనివాస్, మ్యాక లక్ష్మణ్, తాళ్ల హరినాథ్, ఓల్లల మల్లేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.