రేవంత్‌పై సెలబ్రిటీల ప్రశంసలు
NEWS Sep 02,2024 03:32 pm
హైడ్రా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అని నాగబాబు Xలో పోస్ట్ చేశారు. డైరెక్టర్ హరీశ్ శంకర్.. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. హైడ్రా అనేది మన సహజ పర్యావరణ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫార్వర్డ్-థింకింగ్ విధానాన్ని సూచిస్తుందని నటి మధుశాలిని అన్నారు. రేవంత్ విజన్, నాయకత్వానికి థాంక్స్ చెప్పారు.