ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు
NEWS Sep 02,2024 03:34 pm
దండేపల్లి మండల కేంద్రంలో నేతకాని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎద్దులను, ఆవులను అలంకరించి భాజా భజంత్రీలతో భక్తిశ్రద్ధలతో ఊరేగింపు తీసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘ నేతలు రాజమల్లు మాట్లాడుతూ.. పొలాల అమావాస్య పర్వదినాన్ని ప్రభుత్వం జనరల్ హాలిడే గా ప్రకటించాలని కోరారు. ఈ వేడుకలో సంఘ నాయకులు గొల్ల రాజమల్లు, సాయిని రాజలింగు, లక్ష్మణ్, ప్రేమ్ సాగర్, సాయిని రాజం, భగీ లింగన్న, పోచన్న, తదితరులు పాల్గొన్నారు.