విజయవాడ: వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగాయి రెండు హెలికాఫ్టర్లు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందిస్తున్నాయి NTRF బృందాలు.. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేశారు. బిస్కెట్స్, బ్రెడ్, జ్యూస్ ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. హెలికాఫ్టర్ల ద్వారా బాధితుల ఇళ్లపై ఆహార ప్యాకెట్లను జారవిడుస్తున్నారు సిబ్బంది. మరో 2 హెలికాఫ్టర్లు కూడా రాబోతున్నాయి.