గొర్రె కాపరుల సహకార సంఘాల ఎన్నికల కోసం కృషి చేయాలి.
NEWS Sep 02,2024 01:57 pm
గొర్రె కాపరుల సహకార సంఘాల ఎన్నికల కోసం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్ అన్నారు. చిగుర్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేవంలో ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కడారి ఐలయ్య హాజరయ్యారు.