దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం నెల పూర్తి కావడంతో, సోమవారం రోజున అమావాస్య కావడంతో రాజన్న ఆలయంలో భక్తులు లేక వెలవెల పోయింది. శ్రావణమాసం మొదలు మొన్నటి ఆదివారం వరకు ప్రతినిత్యం వేలాదిమంది రాజన్నను దర్శించుకున్న భక్తులు సోమవారం రోజున భక్తులు లేక ఆలయం వెలవెలబోయింది. రాజన్న ఆలయంలో భక్తులు లేక కోడెలు సైతం విశ్రాంతి తీసుకున్నాయి. అరకొర భక్తులు రాజన్నను నిమిషాల వ్యవధిలో దర్శనం చేసుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.