బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి
NEWS Sep 02,2024 02:01 pm
కరీంనగర్: బీసీల కులగణన చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన్ కార్యక్రమం నిర్వహించారు.