బీమా రక్షణలో తిరుగులేని ఎల్ఐసి
NEWS Sep 02,2024 12:59 pm
దేశ ప్రజలకు బీమారక్షణ కల్పించడంలో గత 68 ఏళ్లుగా తిరుగులేని సంస్థగా ఎల్ఐసి ఎదిగిందని ప్రజల సొమ్ము ప్రజల కొరకే అనే నినాదంతో అనేక ప్రభుత్వ పథకాలకు చేయూతనందిస్తుందని ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్ అన్నారు. డివిజనల్ ఆఫీసులో 68వ బీమా వారోత్సవాలను పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ సేవకి పునరంకితమవుతామని ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులతో కలిసి జ్యోతి వెలిగించారు.